భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

నిర్వాసితులు కోరుకున్నచోటే పునరావాసం కల్పించాలి

WhatsApp Image 2025-10-30 at 8.03.54 PM

భారత్ సమాచార్.నెట్, అల్లూరి సీతారామరాజు: పోలవరం నిర్వాసితులకు వారు కోరుకున్న చోటే పునరావాసం కల్పించాలని వడ్డీగూడెం పంచాయతీ వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ శుభం నూక్వాల్‌ను కోరారు. సర్పంచ్ సోడి నర్సమ్మ, వైస్ ఎంపీపీ ముత్యాల భవాని కలిసి వినతిపత్రం ఇచ్చారు. వడ్డీగూడెం బీసీ కాలనీ కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ.. మెజారిటీ నిర్వాసితులు కొయ్యలగూడెం పరిసర ప్రాంతంలో పునరావాసం కోరుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన పీవో, కొయ్యలగూడెం వెళ్లాలనుకునే వారి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం కొనే ధరకు భూమి లభిస్తే, నిర్వాసితులు కోరుకున్నచోట పునరావాసం ఇవ్వడానికి అభ్యంతరం లేదని ప్రాజెక్టు అధికారి తెలియజేశారు.

మ‌రిన్ని క‌థ‌నాలు

చింతూరు సబ్ డివిజన్ ను నియోజకవర్గంగా ప్రకటించాలి.