భారత్ సమాచార్.నెట్, అల్లూరి సీతారామరాజు: పోలవరం నిర్వాసితులకు వారు కోరుకున్న చోటే పునరావాసం కల్పించాలని వడ్డీగూడెం పంచాయతీ వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ శుభం నూక్వాల్ను కోరారు. సర్పంచ్ సోడి నర్సమ్మ, వైస్ ఎంపీపీ ముత్యాల భవాని కలిసి వినతిపత్రం ఇచ్చారు. వడ్డీగూడెం బీసీ కాలనీ కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ.. మెజారిటీ నిర్వాసితులు కొయ్యలగూడెం పరిసర ప్రాంతంలో పునరావాసం కోరుతున్నారని తెలిపారు. దీనిపై…





