భారత్ సమాచార్, ఏలూరు జిల్లా: రాజవొమ్మంగి ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి కిర్రాబు మడేరు కాలువ పై ఆనకట్ట నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే &రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి కోరారు. ఈ మేరకు ఏలూరు జిల్లా వేలేరుపాడులో పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, పునరావాసం కార్యక్రమం నిర్వహించారు. పోలవరం భూసేకరణ, పునరావాసం కొరకు ప్రభుత్వం రూ:1000/-కోట్లు నిధులు విడుదల చేసింది. దానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి మడేరు కాలువపై వంతెన నిర్మించాలని వినతి పత్రం అందజేశారు. దాని ద్వారా కలిగే ప్రయోజనాలపై వివరించారు. వేలాది మంది గిరిజన మరియు గిరిజనేతర రైతులకు ఎంతో ఉపయోగపడే దీనిపై గతంలో ప్రభుత్వం సర్వే కూడా చేపట్టినట్లు తెలిపారు. అలాగే దాని ద్వారా సాగునీరు, తాగునీరు కూడా అందించే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే ఇప్పటికే ఉన్న కొన్ని నీటిపారుదల శాఖ కు చెందిన ప్రాజెక్ట్ ల మరమ్మత్తుల కొరకు అభివృద్ధి నిధులు విడుదల చేయాలని కోరారు.
BHARATH SAMACHAR DIGITAL
2, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్