భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : పటాన్ చెరు పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సర్వీస్ రోడ్‌లో మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముత్తంగి నుంచి ఇంద్రేశం వెళ్తున్న ఆటోలో అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ రవి, చౌహాన్ రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
నిందితులు పటాన్ చెరు పరిసరాల్లో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూనే, రహస్యంగా గంజాయి పెడ్లర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి 13 కిలోల గంజాయితో పాటు, రవాణాకు ఉపయోగించిన ఆటో, రెండు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పటాన్ చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని కథనాలు :
సరస్వతి శిశుమందిర్‌కు భూమి విరాళం