భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

గుంతల వద్ద కూర్చొని వినూత్న నిరసన

0eef9a2c-e610-4f7f-b944-00f078042f28

భారత్ సమాచార్, శ్రీకాకుళం జిల్లా: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ మూడు పార్టీల్లోని కొంతమంది నాయకులు తమ తమ స్థానిక సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తుంటే మరికొందరు మాత్రం సమస్యలపై నిరసనలే తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కూటమి నాయకులు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు .

టెక్కలి బిజెపి స్వచ్ఛభారత్ కన్వీనర్ లింగరాజు నేడు స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. రహదారి గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుంతల వద్ద కూర్చొని నిరసన తెలియజేసి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టెక్కలి పట్టణంలో చాలా సమస్యలపై ఇదే తరహాలో ముందుకు పోతూ ఉన్నారు. వీరిపై ఆ ప్రధాన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.