భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

‘నా నియోజకవర్గాన్ని రోల్ మోడల్‌‌గా తీర్చిదిద్దుతా’

536286085_1310240260468946_9088474273250961978_n

భారత్ సమాచార్, నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మొదలు సీఎం వరకు తనదైన శైలిలో ముక్కుసూటిగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గమైన మునుగోడులో అభివృద్ధి పనుల విషయంలో అధికారులకు తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారు. మునుగోడు నియోజక వర్గంలో నూతన వైన్ షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులకు ప్రత్యేక నిబంధనలు పాటించాలని సూచించారు. ఇటీవల నియోజకవర్గంలో మద్యం షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులు రాజగోపాల్ రెడ్డిని కలవడంతో వారికి మూడు కండీషన్లు పెట్టారు. మొదటది వైన్స్ షాపులు ఉదయం 10గంటలకు తెరవడానికి వీల్లేదు. మధ్యాహ్నం 1గంటకు మాత్రమే షాపులు తెరవాలి. రాత్రి 10గంటలకు క్లోజ్ చేయాలి. రెండవది పర్మిట్ రూ‌మ్‌లు పగటిపూట మూసేయాలి, సాయంత్రం 5గంటలకు ఓపెన్ చేసి వైన్స్ షాపు తోపాటే క్లోజ్ చేయాలి. మూడోది.. బెల్టు షాపులకు లిక్కర్ అమ్మేందుకు వీల్లేదు. తన ఆదేశాల మేరకే మునుగోడులో లిక్కర్ షాపులు నడవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లో మునుగోడును రూల్ మోడల్ చేస్తా:
నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేశారు. గత 20 నెలల్లో బెల్టుషాపులకు లిక్కర్ వెళ్లకుండా ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని 159 గ్రామాల్లో ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేస్తానని, ఈ టీమ్స్ బెల్టుషాపులపై నిఘా పెడతాయని, తన షరతులు, తాను గీసిన లైన్ దాటితే లిక్కర్ వ్యాపారులకు చర్యలు తప్పవని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రోల్ మోడల్‌గా నిలబెడతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

 

మరిన్ని కథనాలు: 

కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు.. పార్టీలో మంటలు పుట్టిస్తున్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు