భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

ధాన్యం కొనుగోలు లేక రైతుల కష్టాలు

WhatsApp Image 2025-11-09 at 9.44.00 PM

భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : అందోల్ నియోజకవర్గం రైతులు ధాన్యం కొనుగోలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ, వాస్తవంలో వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా రోడ్లపైన, జాతీయ రహదారికి ఇరువైపులా పడి ఉంది. మండలంలో ఎక్కడా ఐకేపీ (IKP) లేదా సొసైటీ కొనుగోలు కేంద్రాల సిబ్బంది కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని చెప్పి, ధాన్యం కొనుగోలు మాత్రం ఎక్కడా చేపట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక, అప్పులు తీర్చలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఇబ్బందులపాలు చేస్తోందని రైతులు గోడు వినిపిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి