భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమంలో జహీరాబాద్ మాజీ పార్లమెంటు బీబీ పాటిల్ ఆరుద్ర నక్షత్రం రోజున జంగమయ్య గుట్ట క్షేత్రంలోని శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మహాస్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, సుఖసంతోషాలతో జీవనం గడపాలని మొక్కులు చెల్లించుకున్నారు.
తదుపరి తీర్థ ప్రసాదములు స్వీకరించి జంగమయ్య గుట్ట మఠాధితులు షటస్థల బ్రహ్మ 108 శ్రీశ్రీశ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి వారి మంగళ ఆశీస్సులు అందుకున్నారు. అదే విధంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ జంగమయ్య గుట్ట ఎంతో సు విశాలమైనటువంటి ప్రదేశమని, ఈ ప్రాంతమంతా భక్తి పారవశ్యముతో నిండియున్నది కార్తీకమాసము స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జంగం మహేష్ స్వామి, మడుపతి మడివాలయ స్వామి, నాగభూషణం స్వామి, వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం సలహాదారులు అనిమిశెట్టి జయప్రకాష్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి నవీన్ రామోజీ, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
10, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్