భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ఈ నెల 23,24 వ తేదీన జిల్లాలో జనం బాట ద్వారా కల్వకుంట్ల కవిత రాబోతున్నారని, ఈ పర్యటన ను విజయవంతం చేయాలనీ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రం లో పాలనా గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికలే ఇంపార్టెంట్ అన్నట్టుగా జూబ్లీహిల్స్ కే పరిమితం అయ్యిందని, ప్రతిపక్షం కూడా అదే తంతు కొనసాగిస్తుంటే జాగృతి సంస్థ ఒక్కటే కవిత అక్క నాయకత్వంలో ప్రతి పక్ష పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జాగృతి కి రాజకీయ ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజా ప్రతినిధ్యం వహిస్తున్న సంస్థ జాగృతి అని అన్నారు. నారాయణ పేట జిల్లా అధ్యక్షులు గావినోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కవిత వనపర్తి జిల్లాల్లో ఉన్న అనేక సమస్యలను తెలుసుకుంటున్నారని ఏదుల ప్రాజెక్ట్స్ సందర్శించి ప్రజా సమస్యల సాధన దిశగా కవిత పర్యటన ఉంటుంది అని అన్నారు. ఈ సమావేశం లో జాగృతి రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు వెంకట రమణ మూర్తి, జాగృతి సీనియర్ నాయకులు సురేందర్, పుల్లూరి శ్రీనివాస్ జాగృతి సీనియర్ నాయకులు పూర్ణ చందర్, అశోక్, జన్ను సంతోష్ కుమార్, కేశపాగ ఎల్లస్వామి, అరవింద్, దాసరి విజయ్ ,శాగంటి మనోహర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
13, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్