భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: పేదింటి మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయడం శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో బుధవారం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు శిల్పా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామాంజనేయులు, గౌరవ ఆహ్వానితులుగా జిల్లా అధికారులు టి. రుక్సానా బేగం, జే. రాములు, సౌజన్య, బి. శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి హాజరయ్యారు. బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, లక్ష్మీనారాయణ, మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైర్పర్సన్ రవిసింగారెడ్డి “15 సంవత్సరాల క్రితం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేదింటి మహిళల ఆర్థిక స్థితి మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. నేడు బ్యాంక్ దినదినాభివృద్ధి సాధించి, 13 వేల మహిళా ఖాతాదారులు ఉండగా, 26 కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయి. భవిష్యత్‌లో లక్ష మందికి సేవలు అందించే లక్ష్యంతో 200 కోట్ల రుణాలను అందించేందుకు కృషి చేస్తున్నాం” అని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం–సమాజం–రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, మహిళా సాధికారతే శిల్పా కుటుంబం ముఖ్య ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారులు ప్రయోజనకర అంశాలను వివరించగా, అనంతరం వారిని ఘనంగా సన్మానించారు
BHARATH SAMACHAR DIGITAL
19, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్