భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల జమ

WhatsApp Image 2025-11-19 at 6.44.07 PM

భారత్ సమాచార్.నెట్, నంద్యాల: ఆత్మకూరు మార్కెట్‌ యార్డ్‌లో 21వ విడత పీఎం కిసాన్, రెండో విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కార్యక్రమం ఘనంగా జరిగింది. సహాయ వ్యవసాయ సంచాలకులు కే. హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వంగాల వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం హేమలత మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 25,018 మంది రైతులకు రూ. 17.08 కోట్లు, ఆత్మకూరు మండలంలో 7,257 మంది రైతులకు రూ. 4.93 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. నిధులు అందని రైతులు తమ గ్రామాల రైతు సేవా కేంద్రాలను లేదా మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ వంటి పలు శాఖల అధికారులు తమ పథకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.