భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

సామూహిక ‘వందేమాతరం’ గీతాలాపన కార్యక్రమం

WhatsApp Image 2025-11-19 at 8.21.22 PM

భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : పటాన్ చెరులో డిసెంబర్ 1న ‘వందేమాతరం’ గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సంబరాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 1న నోవాపాన్ పరిశ్రమ సమీపంలోని మైదానంలో ఉదయం 10 గంటల నుంచి 30 వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలతో ఒకేసారి వందేమాతరం గీతాలాపన చేయనున్నట్లు తెలిపారు. వందేమాతరం దేశభక్తికి, ఐక్యతకు ప్రతీక అని ఆయన అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.