భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

విద్యుత్ చౌర్యం జరుగకుండా అధికారులు చర్యలు

537b8999-e88d-4f7a-b9a7-4734c7b54bda

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: విద్యుత్ చౌర్యం జరుగకుండా అరికట్టేందుకు విద్యుత్తు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే త్రిపురారం మండలంలోని నీలాయగూడెం, అంజనపల్లి, రాగడప, ఘంటారావు క్యాంపు గ్రామాలలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు నాలుగు బృందాలుగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేశారు. మిర్యాలగూడ గ్రామీణ సహాయక డివిజనల్ ఇంజనీరు (రూరల్ ఏడిఈ) రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ చౌర్యం జరగకుండా మీటర్లు ఉండి నాన్ ఐఆర్ ఎందుకు రావడం లేదని తనిఖీ చేశారు. కా కార్యక్రమంలో త్రిపురారం మండలం సహాయక ఇంజనీరు ఏ.బాలు నాయక్, సబ్ ఇంజనీర్ పవన్ కుమార్, అక్షయ్ కుమార్, లైన్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ సింగ్, లైన్‌మెన్ మోతీలాల్ నాయక్, రషీద్, సైదా నాయక్, దీప్లా నాయక్, అసిస్టెంట్ లైన్ మెన్లు మధుసూదన్ రెడ్డి, పవన్, నాగయ్య, దామోదర్, పెద్ద నాగరాజు, చిన్న నాగరాజు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.