భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: విద్యుత్ చౌర్యం జరుగకుండా అరికట్టేందుకు విద్యుత్తు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే త్రిపురారం మండలంలోని నీలాయగూడెం, అంజనపల్లి, రాగడప, ఘంటారావు క్యాంపు గ్రామాలలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు నాలుగు బృందాలుగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేశారు. మిర్యాలగూడ గ్రామీణ సహాయక డివిజనల్ ఇంజనీరు (రూరల్ ఏడిఈ) రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ చౌర్యం జరగకుండా మీటర్లు ఉండి నాన్ ఐఆర్ ఎందుకు రావడం లేదని తనిఖీ చేశారు.…