భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వారోత్సవాలు.. ఎమ్మెల్యే కోట్లకు ఘన సన్మానం

7

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వారోత్సవాల సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డిని ఘనంగా సన్మానించి, ప్రత్యేక మెమొంటోను బహూకరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా సావిత్రిబాయి ఫూలే జయంతి వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానాలు చేసి చిత్రపటాలను అందజేస్తున్నామని చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రజలకు కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డికి మెమొంటో అందజేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డోన్ ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, డోన్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ భాషా తదితరులు పాల్గొన్నారు.