భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఆశా వర్కర్లకు యూనిఫామ్ పంపిణీ

13

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రామచంద్రాపురం డివిజన్‌లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆశా వర్కర్లకు యూనిఫామ్ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సేవలను అభినందిస్తూ, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో వారి పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పిహెచ్‌సీ సిబ్బంది హాస్పిటల్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, ప్లంబింగ్ మరమ్మతులు వంటి పలు సమస్యలను కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి, పిహెచ్‌సీ సమస్యలను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సీ డాక్టర్ కల్పన, సిబ్బంది భాస్కర్ రెడ్డి, పిహెచ్‌సీ సిబ్బంది,  స్థానిక నాయకులు పాల్గొన్నారు.