భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

లేబర్ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా ధ‌ర్నా

WhatsApp Image 2025-11-22 at 5.32.04 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నంద్యాల జిల్లా : డోన్ బేతంచెర్ల సర్కిల్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా శనివారం నిరసన జరిగింది. కార్మికులకు నష్టం చేసే ఈ కోడ్‌ల నోటిఫికేషన్ కాపీలను సీఐటీయూ నాయకులు దగ్ధం చేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాణిక్యం, కార్యదర్శి శివరాం, మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నక్కి శ్రీకాంత్ మాట్లాడారు.

44 కార్మిక చట్టాలను కుదించి తీసుకొచ్చిన నాలుగు కోడ్‌లు కార్మికులను “నయా బానిసలు”గా మార్చే చర్య అని తీవ్రంగా విమర్శించారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్రం కార్మికుల హక్కులను తొక్కుతోందని ఆరోపించారు. సమ్మె హక్కు, యూనియన్ హక్కులను దెబ్బతీయడం దుర్మార్గమన్నారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా పోరాటాలను ముమ్మరం చేస్తామని వారు హెచ్చరించారు.