భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

భగవాన్ సత్యసాయి బాబా సేవలు శాశ్వతం: కలెక్టర్ ఏ. సిరి

31

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతమని కర్నూలు కలెక్టర్ సిరి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కర్నూలు కలెక్టర్ల్లో ఆమె మాట్లాడారు. సత్యసాయి బాబా విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టుల ద్వారా అనంతపురం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 166 దేశాల్లో సాయి సేవా సంస్థలు బాబా బోధనలు అమలు చేస్తున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ.. ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింస వంటి బాబా సందేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. అనంతపురం కరవు సమయంలో బాబా చేపట్టిన నీటి ప్రాజెక్టులు ప్రజలకు వరంగా మారాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, DRO వెంకట నారాయణమ్మ, ఇతర అధికారులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.