భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

సిస్టర్ స్థాన్సిలాస్ స్కూల్లో చెకుముకి సంబరాలు

36

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సంబరాలు సిస్టర్ స్థాన్సిలాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బి.డి. సుధీర్ రాజు అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి కాజా హుస్సేన్ రిపోర్టును ప్రవేశపెట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెట్కూరి సీఈవో డాక్టర్ కే. వేణుగోపాల్ పాల్గొని శాస్త్రీయ దృక్పథం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అపోహలు, మూఢనమ్మకాలను పోగొట్టాలంటే శాస్త్రీయ ఆలోచన అవసరమని పిలుపునిచ్చారు. అధ్యాపకులు డాక్టర్ కే. బడే సాహెబ్, విజయ్‌కుమార్, రఘుబాబు శాస్త్రీయ చింతన అవసరాన్ని వివరించారు. హెడ్‌మాస్టర్ వెంకటరెడ్డి శాస్త్రవిజ్ఞానం సమాజ ప్రగతికి కీలకమని చెప్పారు. చెకుముకి సంబరాల్లో 40 టీములు పాల్గొన్నాయి.
ప్రైవేట్ విద్యాసంస్థల విభాగం:
1వ స్థానం – ఏథెనా ఇంగ్లీష్ మీడియం స్కూల్
2వ స్థానం – సెయింట్ జోసెఫ్ హై స్కూల్
3వ స్థానం – సెయింట్ జోసెఫ్ హై స్కూల్

ప్రభుత్వ విద్యాసంస్థల విభాగం:
1వ స్థానం – ఏపీజే అబ్దుల్ కలాం
2వ స్థానం – ఏపీజే అబ్దుల్ కలాం
3వ స్థానం – పెద్దకడుబూర్ మోడల్ హై స్కూల్