భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

గీతంలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవం

WhatsApp Image 2025-11-24 at 3.53.29 PM

భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: క్రమశిక్షణ, దేశ నిర్మాణానికి చిహ్నమైన 77వ ఎన్‌సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో సోమవారం దాదాపు 100 మంది క్యాడెట్లతో ఉత్సాహంగా నిర్వహించారు. క్యాడెట్లు కవాతుతో ఆకట్టుకోగా, అదనపు ఉప కులపతి ప్రొఫెసర్‌ డీ.ఎస్‌.రావు జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంగా, నిజామాబాద్‌ ఎన్సీసీ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ రాజేష్‌ కపూర్‌ ఫీల్డ్‌ ఆర్డర్డ్‌ బ్యాటిలియన్‌ స్ట్రక్చర్ (ఎఫ్ఎఎఫ్‌ఎస్‌) పథకం కింద అదనంగా 80 మంది క్యాడెట్లను మంజూరు చేశారని ప్రొఫెసర్‌ రావు ప్రకటించారు. దీనితో గీతం క్యాడెట్ల సంఖ్య 160కి (రెట్టింపు) చేరింది. ఇకపై పూర్తిస్థాయి కంపెనీగా పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. గత ఐదేళ్లుగా శిబిరాలలో గీతం ఎన్సీసీ స్థిరంగా రాణిస్తోందని రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్ఆర్‌ వర్మ తెలిపారు. ‘యువశక్తి – వికసిత్‌ భారత్‌’ దార్శనికతకు అనుగుణంగా క్రమశిక్షణతో కూడిన యువతను రూపొందించడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందని డైరెక్టర్‌ అంబికా ఫిలిప్స్‌ పేర్కొన్నారు.