భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: క్రమశిక్షణ, దేశ నిర్మాణానికి చిహ్నమైన 77వ ఎన్‌సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం దాదాపు 100 మంది క్యాడెట్లతో ఉత్సాహంగా నిర్వహించారు. క్యాడెట్లు కవాతుతో ఆకట్టుకోగా, అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా, నిజామాబాద్ ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ రాజేష్ కపూర్ ఫీల్డ్ ఆర్డర్డ్ బ్యాటిలియన్ స్ట్రక్చర్ (ఎఫ్ఎఎఫ్‌ఎస్) పథకం కింద అదనంగా 80 మంది క్యాడెట్లను మంజూరు చేశారని ప్రొఫెసర్ రావు ప్రకటించారు. దీనితో గీతం…





