భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

రాష్ట్ర స్విమ్మింగ్ పోటీల్లో కర్నూలు సత్తా

WhatsApp Image 2025-11-24 at 3.41.41 PM

భారత్ సమాచార్.నెట్, కర్నూలు: విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగిన ఏపీ పదవ సబ్‌జూనియర్, జూనియర్ వింటర్ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌–2025లో జిల్లా స్విమ్మర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. వీరు మొత్తం 11 పతకాలు సాధించారు.

గ్రూప్–1 బాలుర విభాగంలో దేవ్ శృత్ సాయి 800 మీ. ఫ్రీస్టైల్‌లో స్వర్ణంతో పాటు మూడు రజతాలు, ఒక కాంస్యం గెలుచుకున్నాడు. అదే గ్రూప్‌ బాలికల విభాగంలో పి. హేమలత రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది. గ్రూప్‌-2 బాలికల విభాగంలో కె. శృతి ఒక కాంస్యం దక్కించుకుంది. ఈ పోటీల్లో రాణించిన దేవ్ శృత్ సాయి, పి. హేమలతతో సహా ఇద్దరు క్రీడాకారులు జాతీయ స్థాయి ఈవెంట్లకు అర్హత సాధించారు. విజేతలను డీఎస్‌డీవో భూపతిరావు, కోచ్ నటరాజ్, జిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహ ఆచారి అభినందించారు.