భారత్ సమాచార్.నెట్, కర్నూలు: విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగిన ఏపీ పదవ సబ్‌జూనియర్, జూనియర్ వింటర్ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌–2025లో జిల్లా స్విమ్మర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. వీరు మొత్తం 11 పతకాలు సాధించారు.

గ్రూప్–1 బాలుర విభాగంలో దేవ్ శృత్ సాయి 800 మీ. ఫ్రీస్టైల్‌లో స్వర్ణంతో పాటు మూడు రజతాలు, ఒక కాంస్యం గెలుచుకున్నాడు. అదే గ్రూప్‌ బాలికల విభాగంలో పి. హేమలత రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది. గ్రూప్‌-2 బాలికల విభాగంలో…