భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎస్.జి.ఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ఖమ్మం జిల్లా జట్టు అద్భుత విజయ పరంపర కొనసాగిస్తోంది. మొదటి మ్యాచ్‌లో కరీంనగర్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో వరంగల్‌పై 75 పరుగుల తేడాతో విజృంభించింది. ఈ పోటీల్లో పినపాక మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వైష్ణవి రత్న విశేష ప్రతిభ కనబరిచింది. కరీంనగర్‌పై 17 బంతుల్లో 32 పరుగులు, వరంగల్‌పై 40 బంతుల్లో 46 పరుగులు చేసి 2 వికెట్లు తీశారు. మహబూబ్‌నగర్‌పై కూడా 2 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలకంగా నిలిచారు.జట్టులో ఉమ్మడి ఖమ్మం ప్రతిభ మరోసారి రాష్ట్రస్థాయిలో మెరిసింది.
BHARATH SAMACHAR DIGITAL
25, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్