భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, ఆగస్టు 2026, సోమవారంభారత్ సమాచార్

ఓనం వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

WhatsApp Image 2026-08-30 at 4.14.17 PM

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: విభిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు పటాన్చెరు నియోజకవర్గం నిలయంగా ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సంప్రదాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కేరళ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఓనం పండుగను రామచంద్రాపురంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే పండుగలు ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పటాన్చెరు నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు ఇతరుల పండుగల్లోనూ భాగస్వాములు కావడం సంతోషకరమని పేర్కొన్నారు.

కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి పండుగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావాన్ని పెంపొందించే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు. ఓనం పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఓనం వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు, యువత, అసోసియేషన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, ఐలేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.