భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: విభిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు పటాన్చెరు నియోజకవర్గం నిలయంగా ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సంప్రదాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ…





