భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సీతానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మొత్తం 167 మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేశారు.
ఆర్వో సీహెచ్. శిరీష ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ఏర్పాట్లు చేశారు. మొత్తం 167…





