సీతానగరం మండలం రాజంపేట గ్రామంలో జడ్పీటీసీ కూటమి అభ్యర్థి బత్తుల వెంకటలక్ష్మి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న ఆమె గ్రామంలోని ఓటర్లను కలిసి స్థానిక ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.