భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అటవీ భూములు, సరిహద్దులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని ఫారెస్ట్ తొర్రూర్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లను అరికట్టడంతో పాటు, రిజర్వ్ ఫారెస్ట్ భూములను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండలంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఇనుగుర్తి ఈస్ట్ బ్లాక్ సరిహద్దుల గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్ ప్రాంతంలో అటవీ భూముల హద్దులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్…






