భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేక భవనాన్ని మంజూరు చేయాలని కోరుతూ ‘తపస్’ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావుకు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం మెదక్ పట్టణంలో ఎంపీని కలిసి జిల్లా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం నాయకులు వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించడానికి ప్రత్యేక భవనం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుతం వేర్వేరు పాఠశాలల్లో ఈ…