భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 176 మంది సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిటర్నింగ్ అధికారి (RO) సీహెచ్. శిరీష ఆధ్వర్యంలో ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు…