భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లికుదురు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సోమవారం రెండో దశ నిరసన చేపట్టారు. రాష్ట్ర మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్…