భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దశాబ్దాలుగా గ్రామస్థులు పూజలు నిర్వహిస్తున్న రెండు పురాతన దేవాలయాలను తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై గుడి యజమానులు, గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

గ్రామ పరిధిలోని మల్లన్న, ఎల్లమ్మ దేవాలయాల్లో సుమారు 40 ఏళ్లుగా గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ దేవాలయాలు ఉన్న భూమిని TGIIIC స్వాధీనం చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించింది. ఆ భూమిలో…