భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో పండుగల వేళ దళితులపై జరుగుతున్న దాడులు, కులవివక్ష ఘటనలను అరికట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బోనాలు, బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు, కులవివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అనితకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవ, కేవీపీఎస్…






