భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, గ్రామీణ, జిల్లా స్థాయి జర్నలిస్టులకు ప్రభుత్వ అక్రెడిటేషన్ ప్రక్రియలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని, అలాగే జర్నలిస్టులు, ప్రభుత్వం మధ్య మరింత సమర్థవంతమైన సమన్వయం ఏర్పడాలని లక్ష్యంగా పురోగామి పత్రికార్ సంఘ్ (భారత్) తరఫున తెలంగాణ ప్రభుత్వ సమాచార & ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ సూర్యవంశీ మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజానన్ బిడ్కర్ కమిషనర్‌కు సమగ్ర వినతిపత్రం అందజేశారు.…