భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం దశాబ్దాలుగా అభివృద్ధి, పారదర్శక పాలనకు కృషి చేసిన నాయకుడిపై వ్యక్తిగత దూషణలు చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ దిగజారుదలకు నిదర్శనమని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు అంశాలపై ఉండాలే తప్ప వ్యక్తిగతంగా అసభ్య వ్యాఖ్యల రూపంలో ఉండకూడదని హితవు పలికింది. ముఖ్యమంత్రి నాయకత్వంలో…