భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ ఎం.భాగోటియా, ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (AIBC) ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… భారత్-ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్…