భార‌త్ స‌మాచార్‌.నెట్, వ‌న‌ప‌ర్తి జిల్లా : తెలంగాణ ఉద్యమకారుడు, మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు శనివారం వనపర్తి జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా బి.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి హాజరయ్యారు.

బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు ప్రసంగించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల…