భారత్ సమాచార్, ఆదిలాబాద్‌ జిల్లా: ఆదిలాబాద్ పట్టణంలో బైక్‌ల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మావల సీఐ స్వామి తెలిపారు. వ్యాపారి అబ్దుల్ రహీం బైక్ శనివారం రాంనగర్‌లో చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ లోని బైపాస్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా షేక్ సద్దాం, రాఠోడ్ సుధాకర్ అనే ఇద్దరు అనుమానాస్పదంగా కన్పించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సింకూ పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు.

 

మరిన్ని కథనాలు: 

అక్రమ సంబంధం.. కన్న…