భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచందర్ రావు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించారు.
…
ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




