భారత్ సమాచార్, వెబ్డెస్క్: తెలంగాణలో చలిగాలులు పెరగనున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో, గురువారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తగిన ఉష్ణ దుస్తులు ధరించాలని సూచించింది.
మిగతా జిల్లాల్లో…





