భారత్ సమాచార్, జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని వార్డ్ నెంబర్ 14 లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. అనంతరం పట్టణంలోని ఆధునాతన సాంకేతిక కేంద్రం (ఐటీసీ) నూతన భవనాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ జానకి రామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:





