భారత్ సమాచార్, నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. భోజనం నాణ్యంగా ఉందా? మెనూ ప్రకారం ప్రతి రోజు సరైన వంటకాలు అందుతున్నాయా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.