భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాల జేఏసీ ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోవడంపై శ్రీనివాస సర్కిల్ వద్ద వంటవార్పు నిరసన నిర్వహించారు. జేఏసీ నాయకులు కమల గణేష్, శేఖర్, ఆఫ్రిది, బాలరాజ్, ఉదయ్, ప్రసాద్, సత్యనారాయణరెడ్డి, కాజా, కృష్ణా రఘు పాల్గొన్నారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన పాఠం చెప్పుతామని హెచ్చరించారు.