భారత్ సమాచార్.నెట్, కర్నూలు: శరన్నవరాత్రుల ముగింపు వేళ భక్తిశ్రద్ధల మధ్య ఓర్వకల్లు మండలం నన్నూరులోని రాగమయూరిలో శ్రీ దుర్గా మాత నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు, అమ్మవారు, వివిధ వేషధారణలలోని కళాకారులు భక్తులను అలరించారు. అనంతరం, కర్నూలులోని కల్లూరు అర్బన్ 21వ వార్డు నిమజ్జన ఊరేగింపులో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని…