భారత్ సమాచార్.నెట్, పెద్దపల్లి: మాజీ కేంద్ర మంత్రి కాక గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను ఆదివారం పెద్దపల్లి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ… మారుమూల ప్రాంతంలో జన్మించినా గొప్ప స్థాయికి ఎదిగి, ప్రజలకు సేవ చేసిన వెంకటస్వామి వంటి మహనీయులు ఈ ప్రాంతంలో జన్మించడం గర్వకారణం అని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని, మహనీయుల ఆదర్శాన్ని అందరం అలవర్చుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…





