భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నర్సింలు శేఖర్ గౌడ్ ఆరోపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు గుట్టలుగా పేరుకుపోయాయని, హమాలీలు, లారీల కొరత కారణంగా సేకరణ ప్రక్రియ…