భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేసినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నాలుగు గేట్ల ద్వారా 1000 క్యూసెక్కులు, మల్యాల పంప్ హౌస్‌లోని రెండు మోటార్ల ద్వారా 600 క్యూసెక్కులు, మొత్తం 1600 క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రత్యేక చొరవతో శనివారం…