భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: డోన్ మున్సిపాలిటీలో రిటైర్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని CITU నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. డిసెంబర్ 2న మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ సప్తశైల రాజేష్, కమిషనర్ ప్రసాద్ గౌడ్‌లతో CITU నేతలు బి.మాణిక్యం శెట్టి, టి.శివరాం సమావేశమయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కార్మికులు ప్రజారోగ్యానికి అందిస్తున్న సేవలను గుర్తించి పెండింగ్‌లో ఉన్న హామీలైన సమ్మె కాలపు జీతాలు, ఎక్స్‌గ్రేషియా,…