భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారానికి, పారదర్శకత కోసం చేపట్టిన భూముల రీసర్వేలో నాలుగో దశను ప్రారంభించింది. ఇందులో భాగంగా కనిగిరి మండలంలోని ఉమ్మనపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవెంకటాయపల్లి గ్రామంలో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రాజేష్ పాల్గొని జనవరి 2న జరగబోయే రీసర్వే గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికే రీసర్వే నిర్వహిస్తున్నామని రిసర్వే జరుగు సమయంలో ప్రజలు వాళ్ళ భూమి వద్దకు…